ఎంఆర్ అగ్రహారంలో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:20 AM
మద్దూరు రామయ్య అగ్రహారంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించిం ది.
రూ.1.20 కోట్ల ఆస్తి నష్టం
ఫర్నీచర్, ఎలకా్ట్రనిక్ సామగ్రి దగ్ధం
సంతకవిటి, సెప్టెంబ రు 17(ఆంధ్రజ్యోతి): మద్దూరు రామయ్య అగ్రహారంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించిం ది. ఈ ప్రమాదంలో సుగంధం చందుకు చెందిన ఫర్నీచర్, ఎలకా్ట్రనిక్స్, హోమ్ అప్లయన్సెస్, బీరువాల తయారీ కేంద్రంలో ఉన్న సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.1.20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారి వై.గోవింద రావు తెలిపారు. విద్యుత్ మీటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెల రేగినట్టు చెప్పారు. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందిం చడంతో వారు అక్కడికి చేరుకుని షటర్లు తెరిచి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొన్ని దివాన్‌కట్లను బయటకు తీసుకురాగలిగారు. అయితే కొద్దిసేపటకే మంటలు దుకాణం మొత్తం వ్యాపించడంతో లోపలికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. షాపులో ఉన్న ఏసీలు, టీవీలు, మంచాలు, పరుపు లు, ప్లాస్టిక్ కుర్చీలు, ఇన్వర్టర్లు, కంప్యూటర్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు తదితర సామగ్రి మంటలకు ఆహుతైంది. గ్రామస్థులు డీజిల్ ఇంజన్ ఏర్పాటు చేసి పైపు ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించా రు. అనంతరం రాజాం నుంచి ఫైర్ ఇంజన్ చేరుకుని మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకువచ్చింది.
రూ. 25 లక్షల ప్రింటింగ్ మిషన్ అగ్నికి ఆహుతి
బీరువాలపై ప్రింటింగ్ చేసేందుకు సుమారు 15 రోజుల కిందట బెంగుళూరు నుంచి రూ.25లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన యూవీ ప్రింటింగ్ మిషన్ కూడా అగ్నికి ఆహుతైంది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజిన్ చేరి ఉంటే ఆ యంత్రానైనా కాపాడుకునే అవకాశం ఉండేదని బాధిత కుటుంబ సభ్యు లు ఆవేదన వ్యక్తం చేశారు.