Mahanadu super మహానాడు అదుర్స్
ABN , Publish Date - May 28 , 2026 | 11:57 PM
Mahanadu super మహానాడు... జిల్లాలో స్ఫూర్తిమంతంగా ముగిసింది. తెలుగు తమ్ముళ్లు, మహిళలు, నాయకులు, శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. అధినేత, యువనేత దిశానిర్దేశాన్ని అనువణువునా నింపుకుని ఉత్సాహంతో ఉరకలెత్తారు. రెండు రోజులూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎల్‌ఈడీ స్ర్కీన్లకు అతుక్కుపోయారు. మంగళగిరి వేదికలో జరిగిన ప్రతీ కార్యక్రమాన్ని వీక్షించారు.
మహానాడు అదుర్స్
టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
హాజరైన 3 లక్షల మంది
73 క్లస్టర్లలోనూ విజయవంతం
నాయకులు, కార్యకర్తలతో మమేకమైన మంత్రి, ఎమ్మెల్యేలు
పసందైన వంటకాలపై ప్రశంసల
ఎటు చూసినా పసుపు దండే
మహానాడు... జిల్లాలో స్ఫూర్తిమంతంగా ముగిసింది. తెలుగు తమ్ముళ్లు, మహిళలు, నాయకులు, శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. అధినేత, యువనేత దిశానిర్దేశాన్ని అనువణువునా నింపుకుని ఉత్సాహంతో ఉరకలెత్తారు. రెండు రోజులూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎల్‌ఈడీ స్ర్కీన్లకు అతుక్కుపోయారు. మంగళగిరి వేదికలో జరిగిన ప్రతీ కార్యక్రమాన్ని వీక్షించారు. రెండు రోజుల సదస్సుతో జిల్లా అంతటా ప్రత్యేక సందడి కనిపించింది. ఎటు చూసినా పచ్చ జెండాలు, టోపీలు, కండువాలే కంట పడ్డాయి. అవిశ్రాంతంగా ప్రసంగాలు విన్న కార్యకర్తలు మధ్యాహ్నం అయ్యేసరికి కమ్మనైన వంటకాలను ఆస్వాదించారు. ఎమ్మెల్యేలు, నాయకులతో హుషారుగా గడిపారు. చంద్రన్న పాటలకు మధ్యమధ్యలో స్టెప్పులేశారు. ఎండల వేడికి ఇబ్బంది కలగకుండా ప్రతి చోటా మజ్జిగ అందుబాటులో ఉంచారు.
విజయనగరం, మే 28 (ఆంధ్రజ్యోతి):
మహానాడు జిల్లాలో విజయవంతం అయ్యింది. ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలతో సభా ప్రాంగణాలు కళకళలాడాయి. రెండురోజుల సభల్లో దాదాపు 3 లక్షల మంది పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఉత్సాహంగా గడిపారు. జిల్లాలో 73 క్లస్టర్లలోనూ మహానాడు దిగ్విజయంగా సాగింది. గురువారం 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదైనా టీడీపీ శ్రేణులు ఉత్సాహంగానే పాల్గొన్నాయి. భోజన వసతులు భేష్ అనిపించాయి. మరోవైపు పార్టీ నాయకత్వం ఎన్నికల్లో మహిళల పాత్రకు సంబంధించి చేసిన ప్రకటన అందరినీ ఆకట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో 33 శాతం టిక్కెట్లను మహిళలకే కేటాయిస్తామన్న ప్రకటనను అందరూ సాదరంగా ఆహ్వానించారు. కాగా రెండు రోజులూ జిల్లాలోని ఎమ్మెల్యేలంతా మహానాడు జరిగే ప్రాంతాలకు వెళ్లి పార్టీ నాయకులు, కార్యకర్తలతో మమేకమయ్యారు. వారితో కలిసి అల్పాహారం, మధ్యాహ్న భోజనం చేశారు. వారితో కలిసి కూర్చుని మహానాడును వీక్షించారు. దీంతో శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో రెండు రోజులూ కలిపి 3 లక్షల మంది మహానాడును తిలకించారు. అందరికీ అల్పాహారం, మఽధ్యాహ్న భోజనం, టీ, స్నాక్స్ వంటివి ఏర్పాటు చేశారు. పసందైన విందుని కార్యకర్తలకు అందించారు. ఉదయం 9 గంటలకు ఆయా వేదికల వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సభను ఆరంభించారు. అదే విధంగా పార్టీ అన్ని నియోజకవర్గాలకు మహానాడు కోసం పరిశీలకులను నియమించింది. వారు ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ ఆదేశాలను క్యాడర్‌కు చేరవేసి మహానాడును విజయంతం చేయడంలో ప్రత్యేక పాత్ర పోషించారు.
ఫ మహానాడు కార్యక్రమంలో భాగంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తప్పెటగుళ్ల కళాకారులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఆయనను చూసి మరికొంత మంది నాయకులు ఉత్సాహంగా నృత్యం చేశారు. బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.