Share News

మహానాడును విజయవంతం చేయాలి

ABN , Publish Date - May 23 , 2026 | 11:41 PM

టీడీపీ ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. శనివారం సాలూరులోని కార్యాలయంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, పార్టీశ్రేణులతో సమావేశం నిర్వహించారు.

మహానాడును విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న సంధ్యారాణి

సాలూరు, మే 23(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. శనివారం సాలూరులోని కార్యాలయంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, పార్టీశ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహా నాడు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని, నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి కోరారు. శనివారం సాలూరులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లో భాగంగా పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. బైక్‌ నడిపి మంత్రి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పొదుపు చర్యల్లో భాగంగా కారు విని యోగాన్ని తగ్గించాలని సూచించారు. ఇంధన పొదుపుపై ప్రత్యేక దృష్టి సారించారు. చెత్తను నిర్థిష్ట ప్రదేశాల్లో వేయాలని, ప్రజలకు సూచించా రు. స్వచ్ఛమైన పట్టణాల నిర్మాణమే లక్ష్యమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, కాళ్ల శ్రీనివాసరావు, మునిసిపల్‌ కమిషనర్‌ రత్నకుమార్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 11:41 PM