Share News

మండల కేంద్రాల్లో ‘మహానాడు’

ABN , Publish Date - May 18 , 2026 | 12:02 AM

మండల కేంద్రాల్లో 27, 28 తేదీల్లో మహానాడును నిర్వ్వహించాలని నాయకులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు.

మండల కేంద్రాల్లో ‘మహానాడు’
నాయకులతో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

మక్కువ రూరల్‌, (సాలూరు) మే 17 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రాల్లో 27, 28 తేదీల్లో మహానాడును నిర్వ్వహించాలని నాయకులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. ఆదివారం క్యాంప్‌ కార్యాలయంలో మక్కువ, సాలూరు, పాచిపెంట, మెంటాడ మండలాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలతో మహా నాడు నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ మహానాడు ను నిర్వహణకు సరైన స్థలాన్ని ఎంపిక చేయా లన్నారు. రెండు రోజులు పాటు నిర్వహించే కార్యక్రమానికి హాజరయ్యే వారికి అల్పాహారం, భోజనాలు సమకూర్చాలన్నారు. మంత్రులు, పొలిట్‌ బ్యూరో సభ్యులు, ముఖ్య నాయకులు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే మహానాడు లో పాల్గొంటున్నం దున మండల కేంద్రంలో మహానాడు నిర్వహణకు నాయ కులు సన్నాహాలు చేసుకోవాలన్నారు. మహానాడు వద్ద పెద్ద స్ర్కీన్‌ను విధిగా ఏ ర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సాలూరు టౌన్‌ అధ్యక్షుడు నిమ్మాది చిటి ్టబాబు, మండల పార్టీ అధ్యక్షుడు ఆమదాల పరమేశ్వరావు, మక్కువ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాలరావు, మెంటాడ మండల పార్టీ అధ్యక్షుడు సీహెచ్‌.వెంకటరావు, నాయ కులు మత్స శ్యామ్‌సుందర్రావుపాల్గొన్నారు.

Updated Date - May 18 , 2026 | 12:02 AM