Share News

Mahanaadu క్లస్టర్ల వారీగా మహానాడు

ABN , Publish Date - May 25 , 2026 | 12:07 AM

Mahanaadu Cluster-Wise టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లాలో తొలిసారిగా క్లస్టర్ల వారీగా మహానాడు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధమవు తున్నారు. నియోజకవర్గాల వారీగా వేదికలు, భారీ స్ర్కీన్లు, సౌండ్‌ సిస్టమ్‌ తదితర వాటిని ఏర్పాటు చేసి పసుపు పండుగను విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

Mahanaadu క్లస్టర్ల వారీగా మహానాడు

  • సమాయత్తమవుతున్న టీడీపీ శ్రేణులు

పార్వతీపురం, మే 24(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లాలో తొలిసారిగా క్లస్టర్ల వారీగా మహానాడు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధమవు తున్నారు. నియోజకవర్గాల వారీగా వేదికలు, భారీ స్ర్కీన్లు, సౌండ్‌ సిస్టమ్‌ తదితర వాటిని ఏర్పాటు చేసి పసుపు పండుగను విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కాగా పార్టీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులతో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులు, కార్యవర్గంలో ముఖ్య నాయకులు పార్టీ సెంట్రల్‌ కార్యాలయం నుంచే వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో క్లస్టర్ల వారీగా ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు కార్యక్రమం నిర్వహిం చనున్నారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్టీ సెంట్రల్‌ కార్యాలయంలో నిర్వహించే మహానాడు వేదికలో పాల్గొని ప్రసంగించనున్నారు. కురుపాం ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, పాలకొండ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి ఆధ్వర్యంలో క్లస్టర్‌ వారీగా మహానాడు నిర్వహించ నున్నారు. ఈ కార్యక్రమం విజయ వంతం చేయాలని ఇప్పటికే పార్టీ నాయకులు, కార్యకర్తలతో జిల్లా ప్రజాప్రతినిధులు సమావే శమయ్యారు. జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా క్లస్టర్‌ ఇన్‌చార్జిలతో టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేష్‌ కూడా మాట్లాడారు. ఏర్పాట్లపై పలు సూచనలిచ్చారు. మరోవైపు పార్టీ అధిష్టానం నియోజక వర్గాలకు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. దీనిలో భాగంగా పాలకొండకు ఎమ్మెల్సీ గ్రీష్మను నియమిస్తూ ఆదివారం ఆదేశాలిచ్చింది. మొత్తంగా పార్వతీపురం నియోజకవర్గంలో 11 , సాలూరులో పది, కురుపాంలో 11, పాలకొండలో పది క్లస్టర్లలో మహానాడు కార్యక్రమం నిర్వహించేందుకు శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.

Updated Date - May 25 , 2026 | 12:07 AM