Ghat Road ఘాట్ రోడ్‌లో లారీ బోల్తా
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:46 PM
Lorry Overturns on Ghat Road పాచిపెంట మండలం కంకణాపల్లి ఘాట్‌రోడ్డులో ( ఏవోబీలో 26వ నెంబరు హైవే) సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఒడిశా నుంచి విశాఖకు బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ప్రయాణికులు, వాహనదారులకు తప్పని ఇబ్బందులు
సాలూరు రూరల్/పాచిపెంట, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): పాచిపెంట మండలం కంకణాపల్లి ఘాట్‌రోడ్డులో ( ఏవోబీలో 26వ నెంబరు హైవే) సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఒడిశా నుంచి విశాఖకు బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సుమారు మూడు కిలోమీటర్లు వరకు వాహనాలు బారులు తీరాయి. దీంతో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాలూరు రూరల్ సీఐ పి.రామకృష్ణ, పాచిపెంట ఏఎస్‌ఐ ముసలయ్య తన సిబ్బందితో అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ తెప్పించి రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీని పక్కకు జరిపించారు. పోలీసులతో పాటు అక్కడుకు చేరిన జనం సైతం శ్రమదానం చేసి బియ్యం బస్తాలను పక్కన వేశారు. దీంతో మంగళవారం ఉదయం నుంచి వాహనాలు యథావిధిగా రాకపోకలు సాగించడంతో ప్రయాణికులు, వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.