Share News

కలెక్టర్‌ వాహనాన్ని ఢీకొట్టిన లారీ డ్రైవర్‌కు వారం రోజులు జైలు

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:10 AM

కలెక్టర్‌ వాహనాన్ని మద్యం మత్తు లో ఢీకొట్టిన లారీ డ్రైవర్‌కు వారం రోజులు జైలుశిక్ష విధించినట్టు ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

కలెక్టర్‌ వాహనాన్ని ఢీకొట్టిన లారీ డ్రైవర్‌కు వారం రోజులు జైలు

విజయనగరం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): కలెక్టర్‌ వాహనాన్ని మద్యం మత్తు లో ఢీకొట్టిన లారీ డ్రైవర్‌కు వారం రోజులు జైలుశిక్ష విధించినట్టు ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకా రం.. కలెక్టర్‌ ఎస్‌.రామసుందరరెడ్డి ఎన్నికల నిర్వహణ పనులను పర్యవేక్షిం చేందుకు ఈనెల 28న బొబ్బిలి వెళ్లి, తిరిగి విజయనగరం వస్తున్నారు. భూసా యవలస కోల్డ్‌ స్టోరేజ్‌ వద్దకు వచ్చే సరికి.. నాగపూర్‌కు చెందిన వివేక్‌ విజయ్‌ కరన్వర్‌ అనే వ్యక్తి మద్యం మత్తులో లారీ నడుపుతూ రాంగ్‌ రూట్‌ల్లో ఎదురుగా వస్తున్న కలెక్టర్‌ వాహనాన్ని ఢీకొట్టాడు. లారీ ఆపకుండా పరారయ్యాడు. పోలీసు లు వెంబడించి పట్టుకుని సాలూరు కోర్టులో హాజరు పరిచారు. ఈ మేరకు లారీ డ్రైవర్‌కు ఏడు రోజులు సాధారణ జైలుశిక్ష విధించినట్టు ఎస్పీ తెలిపారు.

Updated Date - Oct 30 , 2026 | 12:10 AM