ఘాట్‌రోడ్డులో కొండను ఢీకొన్న లారీ
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:50 AM
ఘాట్ రోడ్డులో కొండను లారీ ఢీకొన్న ఘటనలో క్లీనర్ మృతి చెందాడు.
డ్రైవర్‌కు గాయాలు
పాచిపెంట రూరల్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఘాట్ రోడ్డులో కొండను లారీ ఢీకొన్న ఘటనలో క్లీనర్ మృతి చెందాడు. డ్రైవర్‌కు తీవ్ర గాయాల య్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ అర్జున్ తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రకు చెందిన లారీ జగదల్‌పూర్ నుంచి మొక్కజొన్న లోడ్‌తో రాజాం వస్తుండగా శుక్రవారం సాయంత్రం పి.కోనవలస దుర్గగుడి సమీపంలో ఘాట్‌రోడ్డులో లారీ అదుపు తప్పి కొండను ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం నుజ్జైంది. క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లీనర్ మృతదేహాన్ని బయటకు తీశారు. గాయపడిన డ్రైవర్‌ను 108 వాహనంలో సాలూరు సీహెచ్‌సీకి తరలిం చారు. డ్రైవర్ మహారాష్ట్ర నాగపూర్‌కు చెందిన రోహిత్ ఘనశ్యామ్ గార్డెగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు