Share News

తల్లికి వందనం నగదు జమతో బ్యాంకుల వద్ద భారీ క్యూలు.. నగదు కొరతతో ఇబ్బందులు

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:16 AM

Long Queues at Banks ’తల్లికి వందనం’ పథకం కింద కూటమి ప్రభుత్వం నగదు జమ చేస్తుండడంతో తల్లులు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు.

తల్లికి వందనం నగదు జమతో బ్యాంకుల వద్ద భారీ క్యూలు.. నగదు కొరతతో ఇబ్బందులు
సీతంపేట యూనియన్‌ బ్యాంక్‌ వద్ద ఇదీ పరిస్థితి..

సీతంపేట, జూలై27(ఆంధ్రజ్యోతి): ‘తల్లికి వందనం’ పథకం కింద కూటమి ప్రభుత్వం నగదు జమ చేస్తుండడంతో తల్లులు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. సోమవారం సీతంపేటలోని ఎస్‌బీఐ, యూనియన్‌, గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌లు కిటకిటలాడాయి. పెద్దసంఖ్యలో మహిళలు చేరుకోవడంతో బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడింది. దీంతో కొంతమందికి బ్యాంక్‌ సిబ్బంది సగం చొప్పున నగదును చెల్లించారు.

Updated Date - Jul 28 , 2026 | 12:40 PM