Share News

లోకేశ్‌ పర్యటన విజయవంతం

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:35 AM

మంత్రి నారా లోకేశ్‌ పర్యటన విజయనగరంలో విజ యవంతం అయ్యిందని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు.

లోకేశ్‌ పర్యటన విజయవంతం

  • ఎమ్మెల్యే అదితి

విజయనగరం రూరల్‌, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మంత్రి నారా లోకేశ్‌ పర్యటన విజయనగరంలో విజ యవంతం అయ్యిందని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపు ఇవ్వడం పార్టీ శ్రేణు ల్లో ఉత్సాహం కనిపించిందన్నారు. సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆలోచనతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఇప్పటికే పలు పరిశ్రమ లు వచ్చాయన్నారు. ఈ పరిశ్రమలు రానున్న నేపథ్యం లో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. అదే విధంగా భోగాపురం అం తర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు తలమానికం గా మారనున్నదన్నారు. దీనికి అనుబంధంగా ఎడ్యు సిటీ కూడా ఏర్పాటవుతుందన్నారు. మంత్రి లోకేశ్‌ పర్యటన విజయవంతం చేసిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ప్రసాదుల ప్రసాద్‌, అనురాధ బేగం, గంటా రవి, గంటా పోలినాయుడు, పీతల కోదండరా మ్‌, పాసి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 12:35 AM