లోక్‌అదాలత్ విజయవంతం చేయాలి
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:14 AM
కక్షిదా రులు ఈనెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని మండల న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, సీనియర్ న్యాయాధికారి కె.శారదాంబ పిలుపునిచ్చారు. బుధవా రం
రాజాం రూరల్, మార్చి 11 (ఆంరఽధజ్యోతి): కక్షిదా రులు ఈనెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని మండల న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, సీనియర్ న్యాయాధికారి కె.శారదాంబ పిలుపునిచ్చారు. బుధవా రం రాజాంలోని తనచాంబర్‌లో బ్యాంకర్లు, పొలీసులు, న్యాయవాదులు, మునిసిపల్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. న్యాయవాదులు, బ్యాంకర్లు, పొలీసులు, ఇతరసంస్థల ప్రతినిధులు లోక్ అదాలత్ విజయవంతం చేయాలని కోరారు. అదాలత్‌లో రాజీకి అనుకూలమైన సివిల్, క్రిమినల్, ప్రీలిటిగేషన్ కేసులను ఇరుపార్టీల అంగీకారంతో పరిష్కరిస్తామని తెలిపారు. అదాలత్‌లో సివిల్ కేసులు పరిష్కారమైతే కోర్టు ఫీజు వాపస్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. న్యాయస్థానాల వరకూ రాని కేసులను ప్రీ లిటి గేషన్ కేసుల రూపంలో మండల న్యాయ సేవాసంస్థలో ఫైల్ చేసుకుని రాజీ చేసు కోవచ్చని సూచించారు. సమావేశంలో రాజాం బార్ అసోసియేషన్ న్యాయవాదులు, పలు బ్యాంకుల అధికారులు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.