సెప్టెంబరు 12న లోక్ అదాలత్
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:33 AM
జాతీయ లోక్‌అదాలత్‌ను సెప్టెం బరు 12న నిర్వహించను న్నామని, రాజీ పడదడిన క్రిమినల్ 498-ఎ కేసులను పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి రాధాకృష్ణమూర్తి సూచించారు.
బొబ్బిలి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): జాతీయ లోక్‌అదాలత్‌ను సెప్టెం బరు 12న నిర్వహించను న్నామని, రాజీ పడదడిన క్రిమినల్ 498-ఎ కేసులను పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి రాధాకృష్ణమూర్తి సూచించారు. గురువారం బొబ్బిలి కోర్టు ప్రాంగణంలో పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్‌పై కక్షిదారులకు అవగాహాన కల్పించాలన్నారు. సమావేశంలో జూనియర్ సివిల్ న్యాయాధికారి హేమ స్రవంతి, అదనపు జూనియర్ న్యాయాధికారి రోహిణిరావు, సీఐ కె.నారాయణరావు, ఏపీపీ జి.హేమరూప తదితరులున్నారు.