Share News

ట్రాన్స్‌ఫార్మర్‌కు తాళాలు

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:21 AM

పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామంలో గ్రామదేవత పండుగ సందర్భంగా ఊరంతా బంధువులతో నిండి ఉన్న తరుణంలో ఓ వీధిలో మంగళవారం విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

ట్రాన్స్‌ఫార్మర్‌కు తాళాలు

  • గ్రామ పండుగ వేళ నిలిచిన విద్యుత్‌ సరఫరా

  • కొప్పెర్ల వాసుల ఆగ్రహం

భోగాపురం(పూసపాటిరేగ), జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామంలో గ్రామదేవత పండుగ సందర్భంగా ఊరంతా బంధువులతో నిండి ఉన్న తరుణంలో ఓ వీధిలో మంగళవారం విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆగ్రహం చెందిన ఆ వీధివా సులు అసంతృప్తితో ట్రా న్స్‌ఫార్మర్‌కు తాళాలు వేసి, నిరసన తెలిపారు. ఉదయం నుంచి విద్యు త్‌ నిలిచిపోవడంతో స్థానికులతో పాటు బంధు వులు తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతో స్థానికులు ఆగ్రహించి ట్రాన్స్‌ఫార్మర్‌కు తాళాలు వేశారు.

స్థానికులే అడ్డుపడుతున్నారు..

కొప్పెర్లలో పండుగ కారణంగా ఓ వీధిలో అధిక విద్యుత్‌ వినియోగించ డంతో ఓవర్‌ లోడ్‌ అయింది. అయితే వేరే ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి అక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌కు వైరు కలిపితే సమస్య పరిష్కారమవుతుంది. కానీ స్థానికులు అడ్డుపడుతున్నారు.

- దేవుడు, విద్యుత్‌ శాఖ ఏఈ

Updated Date - Jun 17 , 2026 | 12:21 AM