Share News

Local Body Elections పకడ్బందీగా ‘స్థానిక’ ఎన్నికలు

ABN , Publish Date - Oct 19 , 2026 | 11:38 PM

Local Body Elections to Be Held Under Tight Security స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. సోమవారం సాధారణ, వ్యయ పరిశీలకులు, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్ర క్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే.. సంబంధిత కలెక్టర్లు వీలైనంత త్వరగా తమకు నివేదిక పంపాలని సూచించారు.

Local Body Elections  పకడ్బందీగా ‘స్థానిక’ ఎన్నికలు
ఎస్‌ఈసీ వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. సోమవారం సాధారణ, వ్యయ పరిశీలకులు, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్ర క్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే.. సంబంధిత కలెక్టర్లు వీలైనంత త్వరగా తమకు నివేదిక పంపాలని సూచించారు. హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీల ఖర్చులను పరిశీలించడానికి వ్యయ పరిశీలకులు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. డివిజనల్‌ హెడ్‌క్వార్టర్స్‌, స్ర్టాంగ్‌ రూంల వద్ద తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కేం ద్రాల్లో సీసీ టీవీ కవరేజ్‌, లైవ్‌ స్ర్టీమింగ్‌ ఉండేలా చూసుకోవాలన్నారు. ఐజీ రాజకుమారి మాట్లాడుతూ.. హింసాత్మక ఘటనలు జరిగిన చోట బలగాలను మరింతగా పెంచాలన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు నివేదికలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2026 | 11:38 PM