Share News

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:34 AM

స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన అజెండాగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమా రి పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం

  • ఎస్‌.కోట ఎమ్మెల్యే లలితకుమారి

లక్కవరపుకోట, సెప్టెం బరు 15(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన అజెండాగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమా రి పిలుపునిచ్చారు. మంగ ళవారం ఆమె ఎల్‌.కోటలోని తన నివాసం వద్ద ఐదు మండలాల నుంచి వచ్చిన టీడీపీ అధ్యక్షులు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, బూత్‌ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు చౌదరీ బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. కొత్త పింఛన్లు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

విజన్‌-2047లో విద్యార్థులే కీలకం..

కొత్తవలస, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, విజన్‌-2047లో ఇంజినీరింగ్‌ విద్యార్థులే కీలకమని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఇంజనీరింగ్‌ డే సందర్భంగా అర్దానపాలెం సమీపంలో ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రోజెక్టులను పరిశీలించారు. రాష్ట్ర దాసరి కార్పొరేషన్‌ చైర్మన్‌ పీవీ రత్నాజీ, విద్యా సంస్థల ప్రతినిధులు వి.శ్రీనివాసరావు, రమాదేవి, గొంప అయ్యన్న, సన్యాశినాయుడు, కార్తీక్‌, గౌరునాయుడు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 12:34 AM