బెట్టింగులతో జీవితాలు నాశనం: ఎస్పీ
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:26 AM
క్రికెట్ బెట్టింగుల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ జిల్లా పోలీ సుశాఖ రూపొందించిన ‘బెట్టింగు మాయాజాలం’ అనే షార్టుఫిల్మ్ పోస్టర్‌ను ఎస్పీ ఏఆర్ దామోదర్ బుధవా రం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించా రు.
‘బెట్టింగు మాయాజాలం’ షార్ట్‌ఫిల్మ్ పోస్టర్ ఆవిష్కరణ
విజయనగరం క్రైం, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): క్రికెట్ బెట్టింగుల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ జిల్లా పోలీ సుశాఖ రూపొందించిన ‘బెట్టింగు మాయాజాలం’ అనే షార్టుఫిల్మ్ పోస్టర్‌ను ఎస్పీ ఏఆర్ దామోదర్ బుధవా రం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రికెట్ బెట్టింగులకు పాల్పడి.. పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోవడంతోపాటు, చదువులను నిర్లక్ష్యం చేస్తూ జీవి తాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. క్రికెట్ బెట్టిం గులు, ఇతర ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వల్ల యువత ఏవిధంగా ప్రభావానికి గురవుతున్నది, వారి జీవితాల ను ఏవిధంగా నాశనం చేసుకుంటున్నది, డబ్బులను ఎలా నష్టపోతున్నది అన్న విషయాల పట్ల అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా ‘బెట్టింగు మాయాజాలం’ అనే షార్టుఫిల్మ్‌ను రూపొందించినట్టు చెప్పారు. ఈ షార్టుఫిల్మ్‌ను పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామ సందర్శన, కళాశాలల్లో నిర్వహించే అవ గాహన సదస్సుల్లోను ప్రదర్శించి, బెట్టింగుల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తామని ఎస్పీ తెలిపారు. క్రికెట్ బెట్టిం గులకు పాల్పడి, పోలీసులకు పట్టుబడి, పోలీసుస్టేషన్ల లో కేసులు నమోదైతే, ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవ కాశం ఉండదన్నారు. కావున జీవితాలను నాశనం చేసే ఆన్‌లైన్, ఆఫ్‌లైను బెట్టింగుల జోలికి పోవద్దని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆ ర్‌బీ సీఐ కె.కుమారస్వామి పాల్గొన్నారు.