Share News

Get-Together సందడిగా ఆత్మీయ సమ్మేళనం

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:04 AM

Lively and Warm Get-Together ఉత్తరాంధ్రలోని విశాఖ, అరకు పార్లమెంట్‌ ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ ఏర్పాటు చేసిన ‘ఆత్మీయ సమ్మేళనం’ ఉత్సాహంగా సాగింది. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.

 Get-Together సందడిగా ఆత్మీయ సమ్మేళనం
మంత్రి నారా లోకేష్‌తో పార్వతీపురం మన్యం జిల్లా ప్రజాప్రతినిధులు

పార్వతీపురం, మార్చి4(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలోని విశాఖ, అరకు పార్లమెంట్‌ ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ ఏర్పాటు చేసిన ‘ఆత్మీయ సమ్మేళనం’ ఉత్సాహంగా సాగింది. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ ఒక్కో కుటుంబానికి సాదర స్వాగతం పలికి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో కాసేపు మాట్లాడి బాగా చదువుకోవాలని సూచించారు. మొత్తంగా ఆ ప్రాంగణమంతా సరదా సంభాషణలతో నవ్వులు విరిశాయి. అనంతరం మంత్రి లోకేష్‌ స్వయంగా ప్రజాప్రతినిధులకు భోజనం ప్లేట్లు అందించారు. రాజకీయాల ప్రస్తావన లేకుండా కుటుంబంలో శుభకార్యంలా ఆత్మీయ సమ్మేళనం సాగింది. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై ఆయా ప్రజా ప్రతినిధులకు గ్రీవెన్స్‌ స్టేటస్‌ రిపోర్టు ఇచ్చారు. అనంతరం మంత్రి లోకేష్‌ తన నియోజకవర్గం చేనేత కళాకారులు నేసిన మంగళగిరి పట్టుచీరలను మహిళా ప్రజాప్రతినిధులకు చిరుకానుకగా అందజేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 12:04 AM