చినభోగిలిలో మద్యం వ్యాన్ బోల్తా
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:10 AM
: మండలంలోని చినభోగిలి వద్ద గురువారం తెల్లవారుజామున మద్యం, బీరు తరలిస్తున్న వ్యాన్ రాష్ట్రీ య రహదారి గోతుల్లో పడి బోల్తాపడడంతో సీసాలు ధ్వం సమైనట్లు ఎక్సైజ్ ఽఅధికారులు తెలిపారు.
సీతానగరం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చినభోగిలి వద్ద గురువారం తెల్లవారుజామున మద్యం, బీరు తరలిస్తున్న వ్యాన్ రాష్ట్రీ య రహదారి గోతుల్లో పడి బోల్తాపడడంతో సీసాలు ధ్వం సమైనట్లు ఎక్సైజ్ ఽఅధికారులు తెలిపారు. ఎక్సైజ్ సీఐ పద్మా వతి కథనం మేరకు.. నెల్లిమ ర్లలోని ఏపీఎస్‌బీసీఎల్ నుంచి మద్యం, బీరు కేసులతో వస్తున్న వ్యాన్ గురువారం ఉదయం ఐదు గంటల సమయంలో బోల్తా పడింది. సమా చారం అందుకున్న ఎక్సైజ్‌ఇన్‌స్పెక్టర్ డి.పద్మావతి, ఎస్‌ఐ ఐ.సింహాచలం, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రవాణా అనుమతి పత్రం ప్రకారం వ్యాన్‌లో 1,102 కేసుల మద్యం, బీరు ఉన్నట్లు గుర్తించారు. వీటి మొత్తం విలువ రూ.63,76,900లుగా అధికారులు వెల్లడించారు. ధ్వం సమైన బాటిళ్ల వల్ల జరిగిన నష్టం వివరాలు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అనంతరం మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి నిబంధనల మేరకు సంబంధిత లైసెన్స్‌దారులకు సరుకును అప్పగించారు.