లైన్‌మెన్ పోస్టులు భర్తీ చేయాలి
ABN , Publish Date - May 26 , 2026 | 12:02 AM
విద్యుత్ సంస్థలో ఖాళీగా ఉన్న జూని యర్ అసిస్టెంట్, లైన్‌మెన్ పోస్టులు ప్రస్తుతం కాంట్రాక్టు విధానంతో భర్తీ చేయాలని ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ఆర్‌కే గణపతి కోరారు.
ఫఏపీ ఎలక్ట్రిసిటీ ఈయూ (1104) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతి
పార్వతీపురంటౌన్, మే 25 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ సంస్థలో ఖాళీగా ఉన్న జూని యర్ అసిస్టెంట్, లైన్‌మెన్ పోస్టులు ప్రస్తుతం కాంట్రాక్టు విధానంతో భర్తీ చేయాలని ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ఆర్‌కే గణపతి కోరారు. సోమవారం పట్టణంలో ఆ సంఘ పార్వతీపురం మన్యం జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి వేతన సవరణ సంప్రదింపులు కమిటీని పాతవిధానంలోనే ఏర్పాటు చేయా లని కోరారు. కార్యక్రమంలో డిస్కం రాష్ట్ర అధ్యక్షులు వీవీఎస్ నాగేశ్వర రావు, విజయనగరం రీజినల్ కార్యదర్శి ఎస్.లక్ష్మణ పాల్గొన్నారు. కాగా అనం తరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతిరావు, సంఘ సభ్యుల ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా సర్కిల్, డివి జన్ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. మన్యం జిల్లా సర్కిల్ అధ్యక్షుడిగా బి.జీవరత్నం, కార్యదర్శిగా వి.లక్ష్మణలుగా, డివిజన్ అధ్యక్షులుగా ఎన్.వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఆర్.శ్రీధర్‌లను సభ్యులను ఎన్నుకున్నారు.