Share News

వ్యసనాల బారిన పడితే జీవితం సర్వనాశనమే

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:21 AM

వ్యసనాల బారిన పడి యువత తమ జీవితా లను నాశనం చేసుకోవద్దని విజయనగరం డీఎస్పీ ఎస్‌.రాఘవులు పిలుపునిచ్చారు.

వ్యసనాల బారిన పడితే జీవితం సర్వనాశనమే

  • విజయనగరం డీఎస్పీ రాఘవులు

విజయనగరం టౌన్‌, మే 31(ఆంధ్రజ్యోతి): వ్యసనాల బారిన పడి యువత తమ జీవితా లను నాశనం చేసుకోవద్దని విజయనగరం డీఎస్పీ ఎస్‌.రాఘవులు పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయనగరంలోని కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉన్న ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బైక్‌ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు, డ్రగ్స్‌, గంజాయి వినియోగంతో కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు సర్వనాశనం అవుతున్నాయన్నారు. మత్తు పదార్థాల వినియోగంపై యువతకు అవగాహన కలిగించడానికి బ్రహ్మకుమారీస్‌ చేస్తున్న ఈ ర్యాలీ అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజ యోగిని బీకే అన్నపూర్ణ, జేఎన్‌టీయూ విశ్రాంత ప్రిన్సిపాల్‌ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 12:21 AM