హత్య కేసులో జీవిత ఖైదు
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:15 AM
ఎస్.కోట పోలీసుస్టేషన్ పరిధిలో 2004లో నమోదైన హత్య కేసులో ఎస్.కోట మండలం కొత్త మరుపలి ్లకి చెందిన శ్యామల చిన కనకరావుకు జీవిత ఖైదీ, రూ.3వేలు జరిమానా విధి స్తూ విజయనగరం ఐదో అడిషనల్ డిస్ట్రిట్ అండ్ సెషన్స్ న్యాయాధికారి ఎన్.ప ద్మావతి బుధవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ ఏఆర్ దామోదర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విజయనగరం క్రైం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఎస్.కోట పోలీసుస్టేషన్ పరిధిలో 2004లో నమోదైన హత్య కేసులో ఎస్.కోట మండలం కొత్త మరుపలి ్లకి చెందిన శ్యామల చిన కనకరావుకు జీవిత ఖైదీ, రూ.3వేలు జరిమానా విధి స్తూ విజయనగరం ఐదో అడిషనల్ డిస్ట్రిట్ అండ్ సెషన్స్ న్యాయాధికారి ఎన్.ప ద్మావతి బుధవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ ఏఆర్ దామోదర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కనకరావు తన భార్య దారప్పకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో 2024లో మే 26న మామిడితోటలో హత్య చేశాడు. మృతురాలి తల్లి కృష్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమో దు చేశారు. అనంతరం ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి న్యాయస్థానంలో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు తీర్పు వెలువరించింది.