Share News

పరిశుభ్ర బొబ్బిలికి కృషి చేద్దాం

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:01 AM

పరిశుభ్రమైన బొబ్బిలి-ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దాం అని మున్సి పల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు పిలుపు నిచ్చారు.

పరిశుభ్ర బొబ్బిలికి కృషి చేద్దాం
మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్మన్‌ శరత్‌బాబు

బొబ్బిలి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): పరిశుభ్రమైన బొబ్బిలి-ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దాం అని మున్సి పల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు పిలుపు నిచ్చారు. స్ధానిక మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో మంగళవారం పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లా డుతూ స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లోకల్‌ సెల్ఫ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహి స్తున్నామన్నారు. పట్టణాన్ని పరి శుభ్రంగా ఉంచేందుకు ప్రతీ ఒక్కరూ త్రికరణ శుద్ధిగా పనిచేయాలని హితవు పలికారు. మున్సిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి మాట్లాడుతూ శానిటరీ సి బ్బంది విధులు బాధ్యతలను వివరించారు. పని సమయంలో ఎదురయ్యే ప్రమాదాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను తెలియ జేశారు. పీపీఈ కిట్లను సరైన విధంగా ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత ను కాపాడుకోవడం ఎంత అవసరమో అవగాహన కల్పించారు. శానిటరీ సిబ్బంది నిబద్ధత, బాధ్య తాయుతమైన సేవలే ప్రజల ఆరోగ్య పరి రక్షణకు దోహద పడతాయన్నారు. కార్యక్రమంలో ఎన్‌జీవో సంస్థ జిల్లా కో-ఆర్టి నేటర్‌ నారాయణమ్మ, రీసోర్స్‌ పర్సన్‌ సాయి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 12:01 AM