కలిసికట్టుగా పనిచేద్దాం.. అభివృద్ధి సాధిద్దాం
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:54 PM
కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసినాడే గ్రామాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, ఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ సాధికార సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
బొండ పల్లి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసినాడే గ్రామాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, ఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ సాధికార సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం గరుడబిల్లి జంక్షన్ వద్ద ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో నియోజకవ ర్గంలో ఐదేళ్లు తెలుగుదేశం సర్పంచ్‌లుగా బాధ్యతలు చేపట్టిన 35 మందికి ఆయన సత్కరించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల దృష్టి సారించకుండా వారి వ్యక్తిగత, వ్యాపార మనుగడకే పాలన సాగించారని దుయ్యబట్టా రు. గ్రామాల్లో సమస్యలు తమ దృష్టికి తీసుకురండి, పరిష్కార మార్గాలు చూపుదామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి కొండపల్లి కుటుంబం ఎళ్లవేళలా తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతిఒక్కరూ జనసైనికుల భాగస్వామ్యంతో.. పదవికాదు పార్టీ ముఖ్యం అనే నినాదంతో పనిచేయాలని కోరారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతినెలా నియోజకవర్గంలో ఒక గ్రామం ఎంపిక చేసి, స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దే దిశలో చర్యలు తీసుకుంటున్నాని తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రూ.160 కోట్లతో ఆర్‌అండ్‌బీ రహదారుల మరమ్మతులు చేపట్టామని చెప్పారు. అలాగే వివిధ గ్రామాల్లో లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి 270 ట్రాన్స్ ఫార్మర్లు నెలకొల్పామని తెలిపారు. సీనియర్ నాయకుడు కొండపల్లి కొండలరావు మాట్లాడుతూ విభజన ఆదాయం, అభివృద్ధి తెలంగాణాకు వదలడం తో ఆంధ్రప్రదేశ్ అంధకారంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం ఏఎంసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పీవీవీ గోపాలరాజు, కె.కృష్ణ, బొండపల్లి, గజపతినగరం, గంట్యాడ, దత్తిరాజే రు, జామి మండలాల అధ్యక్షులు రాపాక అచ్చంనా యు డు, గంట్యాడ శ్రీదేవి, కొండపల్లి భాస్కర్‌నాయు డు, చప్ప చంద్రవేఖర్, పి.స్వామినాయుడుతోపాటు మాజీ జడ్పీటీసీ మక్కువ శ్రీధర్ పాల్గొన్నారు.