‘టీనేజ్ గర్భధారణ నివారణకు కృషిచేద్దాం’
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:44 AM
టీనేజ్ గర్భధారణ నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని ఐసీడీఎస్ పీడీ బాలమణి పిలుపునిచ్చారు.
బొబ్బిలి, జూలై 22 (ఆంధ్రజ్యోతి):టీనేజ్ గర్భధారణ నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని ఐసీడీఎస్ పీడీ బాలమణి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో టీనేజ్ గర్భధారణ నివారణ, బాల్యవివాహాల నిర్మూలన, పోషకాహార ప్రాధాన్యంపై అంగన్‌వాడీ కార్యకర్తలు, కిశోర బాలికలు, గర్భిణులు, అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టబద్ధమైన వయస్సు వచ్చాకే వివాహాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్, ఏంఈవో వాసు, సీడీపీవో జె.విజయలక్ష్మి, పిరిడి వైద్యాదికారి భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.