ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:56 PM
ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు.
ఘనంగా టీడీపీ వ్యవస్థాపకుడి వర్ధంతి
జిల్లా అంతటా నివాళులు
ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల అన్నదానం ఏర్పాటు చేశారు. రొట్టెలు, పండ్లు, వస్త్రాలు పంపిణీ చేశారు.
(ఆంధ్రజ్యోతి బృందం)