Share News

‘అభివృద్ధి నిరోధకులను తొలగిద్దాం’

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:24 AM

తోటపల్లి దేవస్థానం అభివృద్ధికి ఆటంకం కలిగించే వారిని తొలగించేందుకు దేవస్థానం అభివృద్ధి సేవా కమిటీ ప్రతినిధులు తీర్మానించారు.

‘అభివృద్ధి నిరోధకులను తొలగిద్దాం’
మాట్లాడుతున్న దేవస్థానం అభివృద్ధి సేవా కమిటీ ప్రతినిధి

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి దేవస్థానం అభివృద్ధికి ఆటంకం కలిగించే వారిని తొలగించేందుకు దేవస్థానం అభివృద్ధి సేవా కమిటీ ప్రతినిధులు తీర్మానించారు. ఆదివారం తోటపల్లి దేవస్థానం ప్రాంగణం లో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీ డాక్టర్‌ డి.పారినాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మేనే జింగ్‌ ట్రస్టీ ద్వారపురెడ్డి ధనుంజయరావు మాట్లాడారు. దేవస్థానం అభివృద్ధికి గతం లో ప్రభుత్వ సహకారం అంతంత మాత్రంగానే ఉండేదన్నారు. దేవస్థానానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ఈ ప్రాంతానికి చెందిన పలువురితో అభివృద్ధి సేవా ట్రస్ట్‌ ఏర్పాటు చేశారన్నారు. దాతలు, ట్రస్ట్‌ ప్రతి నిధులు సహకారంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అయితే దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొంతమంది సేవా కమిటీ సభ్యులు ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. దేవస్థానం ప్రతిష్ఠను దిగజార్చేందుకు యత్నించడం బాధాకరమన్నారు. అలాంటి అభివృద్ధి నిరోధకులను తొలగించేందుకు కమిటీ తీర్మానం చేసింది. సమావేశంలో దేవ స్థానం కమిటీ చైర్మన్‌ ఎం.పకీరునాయుడు, ట్రస్టీ కె.శ్రీరామ్మూర్తి, నాటక అకాడమి డైరెక్టర్‌ అంబటి తవిటినాయుడు, ఎంపీటీసీ సభ్యులు ఎం.సింహాచలంనాయుడు, వై.శ్రీనివాసరావు, ఆవాల కన్నయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 12:24 AM