Share News

పాడిపంటలను కాపాడుకుందాం: ఎమ్మెల్యే కోళ్ల

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:00 AM

భారతదేశంలో పాడిపంటలు తల్లిదండ్రుల వంటివని ఎమ్మెల్యే లలితకుమారి అన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 పాడిపంటలను కాపాడుకుందాం: ఎమ్మెల్యే కోళ్ల
మాట్లాడుతున్న ఎమ్మెల్యే లలితకుమారి

లక్కవరపుకోట, మార్చి 26(ఆంధ్రజ్యోతి): భారతదేశంలో పాడిపంటలు తల్లిదండ్రుల వంటివని ఎమ్మెల్యే లలితకుమారి అన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం కల్లేపల్లి గ్రామంలో కొత్తవలస మార్కెటింగ్‌ శాఖ చైర్మన్‌ చొక్కాకుల మల్లునాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా పశువైద్య శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తోందని తెలిపారు. మార్కెటింగ్‌శాఖ ద్వారా రైతుల పశువులకు ఖరీదైన మందులు అందజేస్తోందని తెలిపారు. రైతుల బాగుకోసం నియోజకవర్గంలో ఇరవై నెలల్లో రూ.300 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్‌ కమిటీ కార్యదర్శి విజయ్‌బాబు, డైరెక్టర్‌ ఐ.వెంకటలక్ష్మి, సర్పంచ్‌ గోకేడ ముసలినాయుడు, కల్లేపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు జక్కాన కన్నబాబు, రేగ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రావాడ ఈశ్వరరావు, మాజీ సర్పంచ్‌ యడ్ల ఈశ్వర రావు, పశు వైద్యు లు కన్నం నాయుడు, సత్య నారాయణ, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

ముఖచిత్రం మారినట్లే..

నక్కపల్లిలో మెగా స్టీలు ప్లాంటు నిర్మాణంతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారనుందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. గురువారం ఆమె నివాసం వద్ద పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అల్సెరార్‌ మిట్టల్‌ అండ్‌ నిప్పన్‌ స్టీల్‌ ప్లాంటు మన ప్రాంతానికి రావడం మన అదృష్టమన్నారు. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. కూటమి ప్రభుత్వం పట్టుదల, కృషితో ప్రధానమంత్రి మోదీ మన కలలను నెరవేర్చారని... అందుకు రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో దాసరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొట్నూరు రత్నాజీ, ఏఎంసీ చైర్మన్‌ చొక్కాకుల మల్లునాయుడు, రాయవరపు చంద్రశేఖర్‌, చిన్నబ్బినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 12:00 AM