చెత్తరహిత పాలకొండగా తీర్చిదిద్దుదాం
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:18 AM
చెత్త రహిత పాలకొండగా తీర్చి దిద్దేందుకు పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని పాలకొండ సబ్‌కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ కోరారు.
పాలకొండ, ఫిబ్ర వరి 14 (ఆంధ్ర జ్యోతి): చెత్త రహిత పాలకొండగా తీర్చి దిద్దేందుకు పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని పాలకొండ సబ్‌కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ కోరారు. పట్టణంలో శనివారం ఉదయం ఆయన పాలకొండ బస్టాండ్‌తో పాటు పలు వీధుల్లో పర్యటించారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై పరిశీలించారు. బస్టాండ్ పరిసరాల్లో ప్రయాణికులు చెత్త వేయ కుండా చూడాలని ఆర్టీసి సిబ్బందికి సూచించారు. తాగునీటి కుళాయిలు, మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఆ యన మాట్లాడారు. ప్రతీ వీధిలో ప్రజలతో పారిశుద్య కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు శుభ్రతపై కమిటీ సభ్యులు వివరించాలని ఆదే శించారు. అనంతరం అన్న క్యాంటీన్‌ను ఆయన పరిశీలించారు. క్యాంటీన్‌లో అల్పాహారం తీసుకున్నారు.