Share News

బాల్య వివాహాలను నిర్మూలిద్దాం

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:19 AM

బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారం సాలూరు ఐసీడీఎస్‌ కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యక్తరలతో సమావేశం నిర్వహించారు.

బాల్య వివాహాలను నిర్మూలిద్దాం
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా బాలల సంరక్షణ అధికారి సత్యనారాయణ

సాలూరు, జూలై18(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారం సాలూరు ఐసీడీఎస్‌ కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యక్తరలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్చదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. 18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాలలోపు బాలురకు వివాహాలు జరపడం చట్టరీత్యా నేరమని తెలిపారు. బాల్య వివావిహాల వల్ల బాలికల ఆరోగ్యం, ద్య, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటుందని వివరించారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మహిళా, యువజన సంఘాలు సమన్వయంతో పనిచేసి బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని కోరారు. ఎక్కడైనా ఇటువంటి వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే.. మహిళా పోలీసు, పంచాయతీ కార్యదర్శి అధికారులకు లేదా 1098 నెంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ ప్రతిఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. ఈ సమావేశంలో సీడీపీవో కే.మంగమ్మ, జిల్లా బాలల సంరక్షణ విభాగం సోషల్‌ వర్కర్‌ పైడపునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2026 | 12:04 PM