Intestinal Worms నులిపురుగులను నిర్మూలిద్దాం
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:14 PM
Let’s Eliminate Intestinal Worms చిన్నారుల ఆరోగ్య సమస్యలకు కారణమైన నులిపురుగులను నిర్మూలిద్దామని జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పెదబొండపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. దీనికి మఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. అనంతరం వారికి ఆల్బెండజోల్ మాత్రలు వేశారు.
పార్వతీపురం రూరల్, ఫిబ్రవరి17(ఆంధ్రజ్యోతి): చిన్నారుల ఆరోగ్య సమస్యలకు కారణమైన నులిపురుగులను నిర్మూలిద్దామని జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పెదబొండపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. దీనికి మఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. అనంతరం వారికి ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. బహిరంగ మలవిసర్జన మానుకోవాలని, భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. అనంతరం డోకిశీల ఆశ్రమ పాఠశాల, డోకిశిల, పెదబండపల్లి పీహెచ్‌సీలను సందర్శించారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకోవాలని , పరిశు భ్రత పాటించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ పరిశీలనలో డీఎంహెచ్‌వో భాస్కరరావు, డీఐవో విజయ్‌మోహన్, ప్రోగ్రాం మేనేజర్ టి.జగన్మోహన్‌రావు, కార్యక్రమ రాష్ట్ర పరిశీలకుడు జె.నరసింగరావు, జిల్లా ఆర్‌బిఎస్‌కే అధికారి జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.