Share News

ఐకమత్యంగా ఉందాం

ABN , Publish Date - May 18 , 2026 | 12:05 AM

హక్కుల సాధన కోసం ఐకమ త్యంగా ఉందామ కళింగవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కళింగ కోమటి కార్పొ రేషన్‌ చైర్మన్‌ బి.గోవిందరాజులు అన్నారు.

ఐకమత్యంగా ఉందాం
నూతన కార్యవర్గంతో గోవిందరాజులు

పార్వతీపురం టౌన్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): హక్కుల సాధన కోసం ఐకమ త్యంగా ఉందామ కళింగవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కళింగ కోమటి కార్పొ రేషన్‌ చైర్మన్‌ బి.గోవిందరాజులు అన్నారు. ఆదివారం పట్టణంలోని కళింగ వైశ్య కల్యాణ మండపంలో ఆ సంఘ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికకు ఆయ న ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో కళింగ వైశ్యుల జనాభా అధికంగా ఉందన్నారు. మన్యం జిల్లాలో కొన్ని మెజా ర్టీ కులాల తర్వాత మూడో స్థానంలో ఉందనేది వాస్తవమన్నారు. సీఎం చంద్రబాబు హయాంలో కళింగ వైశ్యులకు సముచిత స్థానం లభించిం దన్నారు. ప్రస్తుతం బీసీ-డి రిజర్వేషన్‌ నుంచి ఓబీసీల్లో చేర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. హక్కుల సాధనతో పాటు రిజర్వేషన్‌ కోసం తమ గళాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వినిపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జిల్లా కేంద్రంలో రానున్న ఎన్నికల్లో కళింగ వై శ్యులు తమ బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కళింగ వైశ్య సంఘ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కె.ప్ర దీప్‌, ప్రధాన కార్యదర్శిగా పి.శ్రీనివాసరావు, కోశాధికారిగా టి.వెంకటరమణ లను ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికైన కారవర్గ సభ్యులతో రాష్ట్ర అధ క్షుడు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో కళింగ వైశ్య సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి పి.సాయికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2026 | 12:05 AM