Share News

కలిసికట్టుగా గ్రామాభివృద్ధిని సాధిద్దాం

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:49 PM

గ్రామాల్లో ప్రజలంతా కుటుంబంగా కలిసున్ననాడు గ్రామాభి వృద్ధి సాధ్యపడుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివా స్‌ అన్నారు.

కలిసికట్టుగా గ్రామాభివృద్ధిని సాధిద్దాం

  • మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

బొండపల్లి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజలంతా కుటుంబంగా కలిసున్ననాడు గ్రామాభి వృద్ధి సాధ్యపడుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివా స్‌ అన్నారు. మండలంలో గొల్లుపాలెం గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేశారు. గ్రామానికి వెళ్లే పురాతన కల్వర్టు పునఃనిర్మాణానికి రూ.25లక్షల వ్యయంతోను, అలాగే ఈశ్వర కోవెలకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10ల క్షల ఉపాధిహామీ నిధులతో ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సర్పంచ్‌, మాజీ ఎంపీటీసీ పోతుల రమణమ్మ, వారి అనుచరులు వంద కుటుంబాలను ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ఈసంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ గ్రామంలో అభివృద్ధికి ప్రాధాన్యత చూసి అందరూ ఒక కుటుంబంగా కలిసి ఉండడం సంతోషదాయక మన్నారు. పంట పొలాల్లో బోరుబావులకు దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే గొల్లుపాలెం గ్రామా న్ని రెవెన్యూ విలేజ్‌ చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తొత్తడి పైడిపునాయుడు వినతిపత్రం అందజేశారు. త్వరలో అమలు జరిగే దిశగా చర్యలు చేపడతానని మంత్రి హామీఇచ్చారు. అలాగే గత ఐదేళ్లుగా ఎంపీహెచ్‌ఏ(ఫిమేల్‌)గా పనిచేస్తున్న ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేసి ఉద్యోగ భద్రతకు జీవో నెంబరు 143ను రద్దు చేయాలని కోరుతూ ఏఎన్‌ ఎంలు మంత్రికి వినతిపత్రం అందజేశారు. అలాగే స్వచ్ఛభారత్‌ రథాన్ని ఆయన ప్రారంభించారు. దేవు పల్లి గ్రామంలో లోవోల్టేజీ సమస్య తొలగించేందుకు సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని స్థాని క పీహెచ్‌సీ వద్ద పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్షుడు పీవీవీ గోపాలరాజు, బొండపల్లి, గజపతినగరం, గంట్యాడ, దత్తిరాజేరు మండలాల పార్టీ అధ్యక్షులు రాపాక అచ్చంనాయుడు, గంట్యాడ శ్రీదేవి, చప్ప చంద్రశేఖర్‌, ఆండ్ర జలాశయం అధ్యక్షు డు సతీష్‌కుమార్‌లతోపాటు టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు ముంజేటి పార్వతి, పాశల కన్నంనాయు డు, అల్లు విజయకుమార్‌, రంది అర్జున్‌మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 11:49 PM