చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దుదాం
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:06 AM
సాలూరును చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దుదామని రాష్ట్ర గిరిజ సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పిలుపునిచ్చారు.
సాలూరు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): సాలూరును చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దుదామని రాష్ట్ర గిరిజ సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని నిర్వహించిన ఏక్ దిన్-ఏక్ ఘంట పారిశుధ్య కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతు బజారు పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజలతో కలిసి పరిసరాలను ఆమె శుభ్రం చేశారు. పార, చీపురు పట్టి చెత్తను తొలగించారు. స్థానిక వ్యాపారులకు ప్రజలకు ఏక్ దిన్-ఏక్ ఘంట కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. అందిరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.