Share News

సంకిలి కర్మాగారాన్ని రక్షించుకుందాం

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:05 AM

ఉత్తరాంధ్రకు పెద్దదిక్కుగా ఉన్న సంకిలి ఈఐడీ ప్యారీ షుగర్‌ ఫ్యాక్టరీ ని కలిసికట్టుగా కాపాడుకుందామని, దీనిని నిలబెట్టేం దుకు ఏ స్థాయికైనా వెళ్దామని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీ ఎస్‌కేకే రంగారావు(బేబీనాయన) సంకిలి షుగర్‌ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ సభ్యులకు హామీఇచ్చారు.

సంకిలి కర్మాగారాన్ని రక్షించుకుందాం

  • బొబ్బిలి ఎమ్యెల్యే బేబీనాయన

రేగిడి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రకు పెద్దదిక్కుగా ఉన్న సంకిలి ఈఐడీ ప్యారీ షుగర్‌ ఫ్యాక్టరీ ని కలిసికట్టుగా కాపాడుకుందామని, దీనిని నిలబెట్టేం దుకు ఏ స్థాయికైనా వెళ్దామని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీ ఎస్‌కేకే రంగారావు(బేబీనాయన) సంకిలి షుగర్‌ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ సభ్యులకు హామీఇచ్చారు. ఇటీవల సంకిలి సుగర్‌ ఫ్యాక్టరీ వచ్చే క్రషింగ్‌ సీజన్‌ మూసి వేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో స్థానిక చెక్కర కర్మాగార రైతులు పరిరక్షణ కమిటీ సభ్యులు.. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయనను వారి క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం కలిశారు. సుపర్‌ ఎల్‌నినో భూతం చూపిం చి 2027-28 క్రషింగ్‌ సీజన్‌ను సంకిలి ఈఐడీ ప్యారీ సుగర్స్‌ మూసివేయటం అన్యాయమని వీరు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. యాజమాన్యం ప్రీప్లాన్‌గా చెరకు సాగుకు ఇచ్చే రాయితీలు నిలిపివేసి, కేన్‌ సిబ్బందిని తొలగించి చెరకు విస్తీర్ణం తగ్గించిందని తాజాగా ఎల్‌ని నో సాకుతో క్రషింగ్‌ మూసివేస్తున్నట్టు ప్రకటించారని, దీనివల్ల చెరకు రైతులు అన్యాయానికి గురవుతారని వివరించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి.. చెరకు రైతు లకు అన్యాయం జరగకుండా ఫ్యాక్టరీని కలిసికట్టుగా కాపాడుకుందామని తెలిపారు. ఇందుకు ముందుగా ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యాజ మాన్యం, చెరకు రైతులతో జాయింట్‌ సమావేశం ఏర్పా టుచేసేశాలా చూస్తానని ఆయన మాటిచ్చారు. ఎమ్మె ల్యేను కలిసిన వారిలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్య దర్శి బుడితి అప్పలనాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సభ్యులు సూర్యప్రకాశ్‌భుక్తా, కెంబూరు కోటిశ్వరరావు, కర్రి రమణ, ఎన్ని నారాయణరావు, బి. సింహాచలం, శ్రీనివాసరావు, వెంకటరమణ ఉన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 12:05 AM