బాల్య వివాహాలను అరికడదాం
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:19 AM
బాల్య వివాహాలు బాలల హక్కులకు భంగం కలిగించడమే కాకుండా వారి విద్య, ఆరోగ్యం, మానసిక వికాసం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయాధికారి డా.ఎ.కృష్ణప్రసాద్ అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్
విజయనగరం కంటోన్మెంట్, నవంబరు 27(ఆంధ్ర జ్యోతి): బాల్య వివాహాలు బాలల హక్కులకు భంగం కలిగించడమే కాకుండా వారి విద్య, ఆరోగ్యం, మానసిక వికాసం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయాధికారి డా.ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. శుక్ర వారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో బాల్య వివా హాలు, చిన్న వయస్సులో బలవంతపు వివాహాలు నిర్మూలనపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు ఎక్కడైనా జరుగుతున్నట్టు తెలిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, వాటిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. న్యాయ సేవాధికార సంస్థకు సంబం ధించి టోల్‌ఫ్రీ నెంబరు 15100కు కాల్ చేసి తెలియ జేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ కె.బాలామణి, మెప్మా పీడీ జీవీ చిట్టిరాజు, బెజ్జిపురం యూత్ క్లబ్ డైరక్టరు ఎం.ప్రసాద్‌రావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబరు జి.ఝాన్సీరాణి, విద్యాశాఖాధికారులు, అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
రేగిడి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు చట్టరిత్యా నేరమని, ఇవి ఎక్కడ జరిగినా వ్యతిరేకించాలని రాజాం ఐసీడీఎస్ ఉనుకూరు సెక్టార్ సుపర్‌వైజర్ సీహెచ్ నూకాలమ్మ కోరారు. ఉనుకూరు గ్రామంలో బాల్య వివాహాల నియంత్రణ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.