Share News

‘షుగర్‌ ఫ్యాక్టరీని పరిరక్షించుకుందాం’

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:18 AM

సూపర్‌ ఎల్‌నినో పేరుతో సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కార్మాగారం 2027-28 క్రషింగ్‌ సీజన్‌ మూసివేస్తున్నట్టు యాజమాన్యం చేసిన ప్రకటనపై ఏపీ రైతు సంఘంతో పాటు, ఈ ప్రాంత చెరకు రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘షుగర్‌ ఫ్యాక్టరీని పరిరక్షించుకుందాం’

రేగిడి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): సూపర్‌ ఎల్‌నినో పేరుతో సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కార్మాగారం 2027-28 క్రషింగ్‌ సీజన్‌ మూసివేస్తున్నట్టు యాజమాన్యం చేసిన ప్రకటనపై ఏపీ రైతు సంఘంతో పాటు, ఈ ప్రాంత చెరకు రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిఎడల సుగర్స్‌ అనుబంధ సంస్థలు ఇథనాల్‌, ఇతర డిస్టలరీ ప్లాంట్‌లు మూసివేయాలని రైతు సంఘం నేతలతో పాటు, ఈ ప్రాంత చెరకు రైతులు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సంకిలి హైస్కూల్‌ సమీపంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అధ్యక్షతన చెరకు రైతుల సమావేశం నిర్వహించారు. ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితిల్లోనూ పరిరక్షించుకుందామని, ఇందుకు చెరకు రైతులంతా రాజకీయాలకు అతీతంగా పోరాడాలని ఏపీ రైతు సంఘంతో పాటు రేగిడి, పాలకొండ మండలాల రైతులు తమ నిర్ణయం ప్రకటించా రు. ఈ సమావేశంలో అప్పలనాయుడుతో పాటు, రేగిడి, పాలకొండ మండ లాల రైతులు మాట్లాడారు. ఫ్యాక్టరీ మూసివేత నిర్ణయం సరికాదన్నారు. యాజమాన్యం తన నిర్ణయం వెనక్కి తీసుకునేవరకు రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు రైతుల తో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని తీర్మానం చేశారు. ఇందుకు ఒక స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు అప్పలనాయుడు, చెరకు రైతులు ప్రకటించారు. ఈ సమావేశంలోం పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2026 | 12:18 AM