Ganeshas. మట్టి గణపతులతో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:29 AM
Let us protect the environment with clay Ganeshas. మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఆదివారం సాలూరు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం జంక్షన్ వద్ద ప్రజలకు మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు.
సాలూరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఆదివారం సాలూరు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం జంక్షన్ వద్ద ప్రజలకు మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను కొనుగోలు చేయరాదన్నారు. వాటి వల్ల పర్యావరణం కలుషితమవుతుందని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నీటిలో కరగడానికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని, ఆ రంగులు, రసాయనాలు నీటిని విషంగా మారుస్తాయని వెల్లడించారు. మట్టి గణపతి ప్రతిమలైతే రెండు గంటల్లో కరిగిపోయి చెరువుకు సారవంతమైన ఎరువుగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.