Share News

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందాం

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:40 AM

పండుగలను జరుపుకోవడం ద్వారా అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందాం
భోగిమంట వద్ద మంత్రి సంధ్యారాణి

సాలూరు, జనవరి9 (ఆంధ్రజ్యోతి): పండుగలను జరుపుకోవడం ద్వారా అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా సంధ్యారాణి హాజరయ్యారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. అనంతరం భోగిమంటను వెలిగించి ఆనందాన్ని అందరిలో నింపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతీ కుటుంబం భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు అన్నదాతలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు, ప్రజలందరికి మంచి జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంచి పాలన అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, కమిషనర్‌ రత్నకుమార్‌తో పాటు కౌన్సిలర్లు మజ్జి శైలజ, వైదేహి, వరలక్ష్మి, హర్షవర్ధన్‌, వరప్రసాద్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 12:40 AM