ఐక్యంగా పోరాడుదాం
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:12 AM
ఐక్యంగా పోరాటం చేసి, భూములను కాపాడుకుందామని భోగాపురం రైతులు నిర్ణయం తీసుకున్నారు.
డేటా సెంటర్ మన ప్రాంతంలో వద్దు
భోగాపురం రైతులు
భోగాపురం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఐక్యంగా పోరాటం చేసి, భూములను కాపాడుకుందామని భోగాపురం రైతులు నిర్ణయం తీసుకున్నారు. డేటా సెంటర్ ఏర్పాటుకు భూముల సేకరణ నిమిత్తం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌పై వారంతా వ్యతిరేకిస్తూ ఆదివారం భోగాపురం పంచాయతీ కార్యాలయం ఆవరణలో సమావేశ మయ్యారు. ఇతర దేశాలు డేటా సెంటర్‌ని వద్దంటే తమ దేశంలోని తమ రాష్ట్రంలో పచ్చని పంట పొలాల్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలనుకోవడం చాలా దారుణం గా ఉందన్నారు. భూములు కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడుతామని నిర్ణయం తీసుకున్నారు. రైతులు కొమ్మూరు సుభోషణరావు, పడాల శ్రీనివా సరావు, పల్లంట్ల జగదీష్, ఆళ్ల ఉదయబాబు, పడాల భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.