El Niño ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొందాం
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:26 AM
Let Us Effectively Tackle the Impact of El Niño ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొ నేందుకు రైతులు విస్తృతంగా ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్ విధానాలను అనుసరించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం సూడుగాంలో పర్యటించారు.
పార్వతీపురం రూరల్, జూన్12(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొ నేందుకు రైతులు విస్తృతంగా ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్ విధానాలను అనుసరించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం సూడుగాంలో పర్యటించారు. గ్రామంలో చేపడు తున్న ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులంతా ప్రకృతి సాగుపై దృష్టి సారించాలన్నారు. పొలాల గట్లుపై మునగ, పనస, జామ, సీతాఫలం, చింత వంటి బహుళ ప్రయోజన మొక్కలను పెంచడం ద్వారా అదనపు ఆదాయం పొందొచ్చని తెలిపారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి సారం తగ్గిపోతుందన్నారు. ఎల్‌నినో ప్రభావానికి అనుగుణంగా పంటల సాగు చేయాలని సూచించారు. అనంతరం వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆయన వెంట డీఏవో భవానీశంకర్ , జిల్లా ఉద్యాన శాఖాధి కారి సత్యనారాయణరెడ్డి, మత్స్యశాఖాధికారి సంతోష్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.