Share News

‘సంకిలి’ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్దాం

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:14 AM

సంకిలిలోని ఈఐడీ ప్యారీ చక్కెర పరిశ్రమను కాపాడుకునేందుకు ఏపీ రైతు సంఽఘం, చెరకు రైతులు నడుంబిగించారు.

‘సంకిలి’ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్దాం

  • ఎంపీ కలిశెట్టి

రేగిడి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): సంకిలిలోని ఈఐడీ ప్యారీ చక్కెర పరిశ్రమను కాపాడుకునేందుకు ఏపీ రైతు సంఽఘం, చెరకు రైతులు నడుంబిగించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చన్నతో పాటు, రాజాం, చీపురుపల్లి ఎమ్మెల్యేలను కలిసిన ఈ వీరు మరో అడుగు ముందుకు వెశారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌)ను మంగళవారం శ్రీకాకుళం జిల్లా రణ స్థలంలోని వారి క్యాంపు కార్యాలయాల్లో విడివిడిగా కలిశారు. సంకిలి చెక్కర పరిశ్రమ 2027-28 క్రషింగ్‌ సీజన్‌ను నిలుపుదల చేస్తున్నట్టు చేసిన ప్రకటనపై వీరితో చర్చించారు. దీనిపై స్పందించిన ఎంపీ.. ఉత్త రాంధ్ర ఆయువుపట్టుగా ఉన్న చెక్కర పరిశ్రమను నిలబెట్టుకోవాలని, దీనిపై చెరకు రైతులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈనెల లో రైతులతో ఢిల్లీ వెళ్లేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ఆయన ఫోన్‌ చేశారు. ఫ్యాక్టరీ సమస్యను కేంద్రం దృష్టి కి తీసుకువెళ్దామని, ఇందులో రైతులు సంఘటితంగా ఉండి, చెరకు సాగుకు ముందుకు రావాలని ఎంపీ కోరారు. ఎంపీ, ఎమ్మెల్యేని కలిసిన వారిలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, పరి రక్షణ కమిటీ సభ్యులు కింజరాపు సురేష్‌, కరణం శ్రీని వాసరావు, చింత సంగంనాయుడు, సూర్యప్రకాశ్‌భుక్తా, పంచరెడ్డి సింహాచలం, కృష్ణారావు, రమణ ఉన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 12:14 AM