Share News

ఫిర్యాదులపై చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలి

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:07 AM

ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కు 36 వినతులు వచ్చాయి.

ఫిర్యాదులపై చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలి

  • ఎస్పీ దామోదర్‌

విజయనగరం క్రైం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కు 36 వినతులు వచ్చాయి. వీటిని ఎస్పీ ఏఆర్‌ దామో దర్‌ స్వయంగా స్వీకరించారు. వీటిలో భూ తగాదాలకు సంబంధించినవి 10, కుటుంబ కలహాలు 4, చీటింగ్‌ 3, నగదు వ్యవహారాలు 3, ఇతర అంశాలకు సంబంధించి నవి 16 వినతులు ఉన్నాయి. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుల పూర్వాపరాలను విచారించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో అద నపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్‌బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్‌ఐలు రాజేష్‌, ప్రభావతి పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 12:07 AM