Share News

reaching Manyam district!మనస్పర్థలతో ఇంటిని వీడి.. మన్యం జిల్లాకు చేరి!

ABN , Publish Date - Sep 20 , 2026 | 11:36 PM

Leaving home due to personal differences... and reaching Manyam district! జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక కుటుంబ సభ్యులతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చింది. అక్కడ రైలెక్కి ఆదివారం పార్వతీపురం రైల్వే స్టేషన్‌కు చేరింది.

reaching Manyam district!మనస్పర్థలతో ఇంటిని వీడి.. మన్యం జిల్లాకు చేరి!

  • తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఏర్పాట్లు

బెలగాం, సెప్టెంబరు20 (ఆంధ్రజ్యోతి): జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక కుటుంబ సభ్యులతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చింది. అక్కడ రైలెక్కి ఆదివారం పార్వతీపురం రైల్వే స్టేషన్‌కు చేరింది. అయితే స్టేషన్‌లో ఒంటరిగా ఉంటూ.. ఊరు కాని ఊరులో భాష తెలియక దిక్కులు చూస్తున్న విద్యార్థినిని ప్రయాణికులు గమనించారు. వెంటనే 181 మహిళా హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించారు. కేవలం పది నిమిషాల్లోనే వన్‌ స్టాప్‌ సెంటర్‌ వాహనంలో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటర్‌ శాంతి కుమారి, పల్లవి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. బాలికను గుర్తించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్పీఎఫ్‌ పోలీసుల సమక్షంలో సురక్షతంగా వన్‌స్టాప్‌ సెంటర్‌కు తీసుకొచ్చారు. విద్యార్థినికి కౌన్సెలింగ్‌ ఇచ్చి.. అక్కడే తాత్కాలికంగా షెల్టర్‌ కల్పించారు. బాలిక కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించారు. వారి వివరాలను ధ్రువీకరించి, చట్టబద్ధమైన విధానాలను పాటిస్తూ తల్లిదండ్రుల వద్దకు విద్యార్థినిని సురక్షితంగా చేర్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

Updated Date - Sep 20 , 2026 | 11:36 PM