పిల్లల్లో అభ్యసన సామర్థ్యం పెంచాలి
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:23 AM
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్లో అభ్యసన సామర్థ్యం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీవో సుజాత సూచించారు.
ఫఐసీడీఎస్ పీవో సుజాత
రామభద్రపురం, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్లో అభ్యసన సామర్థ్యం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీవో సుజాత సూచించారు. రామభద్రపురంలోని అంగన్ వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న జ్ఞానజ్యోతి శిక్షణలో ఆమె మాట్లాడుతూ శారీరక అభి వృద్ధి తదితర వాటిపై అంగన్‌వాడీలు దృష్టి సారించాలని కోరారు. పిల్లల మానసికభాష, సామాజిక భావోద్యేగాలు అభివృద్ధి చేయాల న్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ పోలాకి కృష్ణకుమారి పాల్గొన్నారు.