ప్రకృతి సాగుపై మొగ్గు చూపండి
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:09 AM
మారు తున్న కాలానికి అనుగుణంగా ప్రతీ రైతు ప్రకృ తి సాగుపై మొగ్గు చూపాలని ఎమ్మెల్యే బేబీ నాయన కోరారు.
బొబ్బిలి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): మారు తున్న కాలానికి అనుగుణంగా ప్రతీ రైతు ప్రకృ తి సాగుపై మొగ్గు చూపాలని ఎమ్మెల్యే బేబీ నాయన కోరారు. సింహాచలం పుణ్యక్షేత్రంలోని గోశాల ఆవరణలో జరుగుతున్న సబల భోజ నాల పండుగలో పాల్గొన్న అనంతరం శని వారం సాయంత్రం స్థానిక విలేకరులతో మా ట్లాడారు. దేశవాలీ గోవుల సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. సేంద్రియ విధానంలో పండించే పంటల వల్ల కలిగే ప్రయోజనాలను నేటితరం వారికి తెలియ జేయాలన్నారు. రెండు తెలుగు రాష్ర్టాలలో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రముఖ వ్యవసాయ నిపుణుడు విజయరామ్ విస్తృత ప్రచారం చేస్తుండటం హర్షణీయమన్నారు. ప్రకృతి ఆధారిత పంటల ఉత్పత్తులతో వంటలు వండి అందరికీ అందించడం సంతోషదా యకమన్నారు. స్వతహాగా నాకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి, అవగాహన ఉంది. వ్యసాయశాఖ అధికారులతో కలిసి పనిచేస్తున్నానన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించేలా చర్యలు తీసు కునేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళతానన్నారు. బొబ్బిలిలో కూడా సబల భోజనాల పండుగను నిర్వహించేందుకు విజయరామ్‌ను ఆహ్వానించానన్నారు. ఈ పర్యటన నాకు సంతృప్తినిచ్చిందని, ఇది సమా జానికి చాలా మేలైన కార్యక్రమని బేబీనాయన అన్నారు.