తాగునీటి పైపులైన్‌కు లీకులు
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:40 AM
గంగచో ళ్లపెంట గ్రామంలో తాగునీటి పైపులైన్లు లీక్ కావడం తో నీరు వృథాగా పోవడంతో పాటు కలుషిత నీరు సరఫరా అవుతోందని గ్రామస్థులు ఆందోళన చెందుతు న్నారు.
మరమ్మతుల్లో అధికారుల జాప్యం
నీరు కలుషితం అవుతోందని గంగచోళ్లపెంట గ్రామస్థుల భయాందోళన
గజపతినగరం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): గంగచో ళ్లపెంట గ్రామంలో తాగునీటి పైపులైన్లు లీక్ కావడం తో నీరు వృథాగా పోవడంతో పాటు కలుషిత నీరు సరఫరా అవుతోందని గ్రామస్థులు ఆందోళన చెందుతు న్నారు. కలుషిత నీటి వల్ల డయేరియా, మలేరియా, క్షయ వంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని భ యాందోళన చెందుతున్నారు. వేసవి కాలం కావడంతో తాగునీరు వృథాగా పోతుందని, అలాగే పైపులైన్లు లీక్‌లకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరు తున్నారు. ఎన్నో ఏళ్లగా వేసిన పైపులైన్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. డ్రైనేజీలో పైపులైన్లు ఉండడంతో లీకుల వల్ల మురుగునీరు చేరి తాగునీరు కలుషిత అవుతుంద ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయ తీ పాలకులు, అధికారులు స్పందించి పైపులైన్లకు మరమ్మతులు చేపట్టి.. పరిశుభ్రమైన తాగునీరు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.