న్యాయవాదుల రక్షణ చట్టం చేయాలి
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:12 AM
పీలేరుకు చెందిన న్యాయవాది పూజారి ఎల్లప్పను దుండగులు హత్య చేయడాన్ని ఖండిస్తూ పాలకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు.
పాలకొండ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): పీలేరుకు చెందిన న్యాయవాది పూజారి ఎల్లప్పను దుండగులు హత్య చేయడాన్ని ఖండిస్తూ పాలకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మునిస్వామి, ఉపాధ్యక్షులు ఎం.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి అల్లెన శివదాస్, ఎన్ని ప్రకాష్, మరిచర్ల జగన్మోహన్‌రావు మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు న్యాయవాదులపై భౌతిక దాడులు పెరగడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి న్యాయవాదులు రక్షణ చట్టాన్ని తెచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబునాయుడు రాబోయే క్యాబినెట్ సమావేశంలో న్యాయవాదుల రక్షణ చట్టం చేయాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఉత్తరావల్లి మురళీమోహన్‌రావు, కృషారావు, శామ్యూల్, గాంధీ, కనపాక సూర్యప్రకాష్ పాల్గొన్నారు.