Share News

వైసీపీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయి

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:22 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించా యని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆరోపించారు.

వైసీపీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయి

లక్కవరపుకోట, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించా యని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆరోపించా రు. మంగళవారం ఆమె ఎల్‌.కోటలోని తన నివాసం వద్ద నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వైఎస్‌ జగన్‌ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేపల్లి నియోజకవర్గం లో ఓ పదో తరగతి విద్యార్థి తన అక్కను వేధిస్తున్నార ని ఫిర్యాదు చేసిన ఘటనలో ఆ అబ్బాయిని పెట్రోలు పోసి తగలబెట్టేశారని.. ఈ ఘటన జరిగి నేటికి మూడే ళ్లు కావచ్చిందని గుర్తుచేశారు. జగన్‌ పాలనలో ఐదేళ్లు రాష్ట్రం రావణకాష్టంగా మారిందని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, అన్ని వర్గాల వారికి సమప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ చొక్కాకుల మల్లునా యుడు, జీఎస్‌ నాయుడు, మల్లా రామకృష్ణ, భూపాల్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

గత పాలనలోనే అరాచకాలు..

భోగాపురం, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలోనే రాజకీయ కక్ష సాధింపులు, అరాచకాలు పెరిగాయని టీడీపీ మండల అధ్యక్షుడు కర్రోతు సత్య నారాయణ అన్నారు. బాపట్ల జిల్లాకు చెందిన యువ కుడు అమర్నాథ్‌ గౌడ్‌ దారుణ హత్యకు గురై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తూడెం గ్రామంలో మంగళ వారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివా ళి అర్పించారు. రీసు రమణ, కోరాడ తాతారావు, గరి వెంకటరమణ, బాలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 12:23 AM