Share News

విద్యార్థికి అంతిమ సంస్కారాలు

ABN , Publish Date - Aug 19 , 2026 | 12:19 AM

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ కూలిన ఘటనలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థి తుపాకుల అరుణ్‌తేజ అంతిమ సంస్కారాలు పట్టణంలోని ఆర్‌సీఎం చర్చి ఆవరణలో మంగళవారం నిర్వహించారు.

విద్యార్థికి అంతిమ సంస్కారాలు
మృతదేహాన్ని తీసుకువెళ్తున్న దృశ్యం

సాలూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ కూలిన ఘటనలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థి తుపాకుల అరుణ్‌తేజ అంతిమ సంస్కారాలు పట్టణంలోని ఆర్‌సీఎం చర్చి ఆవరణలో మంగళవారం నిర్వహించారు. గోడ కూలి మృతి చెందిన విద్యార్థికి కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. అందుకు విద్యార్థి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ప్రభుత్వ అధికారులు విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులతో సోమవారం రాత్రి చర్చలు నిర్వహించారు. చర్చలు సఫలం కావడంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన విరమించారు. అనంతరం సాలూరు ఏరియా ఆసుపత్రిలో పంచనామా నిర్వహించి విద్యార్థికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు, పాలకొండ డీఎస్పీ రాంబాబుతో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2026 | 12:19 AM