Share News

పొలంలోనే తుదిశ్వాస

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:26 AM

ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎన్నో సేవలు చేసి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు.

పొలంలోనే తుదిశ్వాస

  • రైతు నేస్తం, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల గ్రహీత

  • గౌరీశ్వరరావు మృతి

రాజాం/ వంగర, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎన్నో సేవలు చేసి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. పదవీ విరమ ణ తర్వాత ప్రకృతి సాగు చేపడుతూ అందరికీ ఆదర్శం గా నిలిచారు. ప్రకృతి సాగులో అతని సేవలకు గాను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఏడాది కిందట రైతునేస్తం అవార్డును అందుకున్నారు. చివరికి తను సాగు చేస్తున్న పొలంలోనే శనివారం అకస్మాత్తుగా తుదిశ్వాస విడిచారు. వివరాలిలా ఉన్నాయి. వంగర మండలం కొత్తవలసకు చెందిన పెంకి గౌరీశ్వరరావు(64) ప్రస్తుతం రాజాంలోని అమ్మవారి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ తర్వాత ప్రకృతి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొత్తవలస గ్రామ శివారులో ఉన్న తన ప్రకృతి వ్యవసాయ పొలంలోనే శనివారం అకస్మాత్తుగా తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కుమారుడు రెడ్‌క్రాస్‌లో పనిచేస్తుండగా.. మరొకరు నైరా కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గౌరీశ్వరరావు రాజాం మున్సిపాలి టీలోని 17వ వార్డులో టీడీపీ కార్యక్రమాల నిర్వహణలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. గౌరీశ్వర్రావు మృతికి చీపురుపల్లి, రాజాం ఎమ్మెల్యే లు కిమిడి కళావెంకటరావు, కోండ్రు మురళీమోహన్‌తో పాటు పట్టణానికి చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.

ఆయన చూపు శాశ్వతం

గౌరీశ్వరరావు గతంలో ఐఆర్‌ఎస్‌కు నేత్రదాన అంగీకార పత్రం అందజేశారు. దీంతో తన పెద్ద కొడుకు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌లో పనిచేస్తున్న పెంకి చైతన్యకుమా ర్‌ కోరిక మేరకు శ్రీకాకుళం నేత్ర సేకరణ కేంద్ర వైద్య సిబ్బంది వచ్చి.. గౌరీశ్వర్రా వు కళ్ల నుంచి కార్నియాలు సేకరించారు.

Updated Date - Aug 09 , 2026 | 12:26 AM